Natyam ad

శ్రీకాళహస్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానo- శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రివర్యులను శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులుతో పాలకమండలి సభ్యులతో కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామినీ శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు కలిసి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు అందించి ఉత్సవాలకు విచ్చేయాలని అభ్యర్థించారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వామి వారి శేష వస్త్రంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామినీ సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తానని ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ భక్తులకు తగిన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధర్మకర్తల మండలికి సూచించారు శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు జిల్లాలోని శాసనసభ్యులు, ముఖ్య ప్రజాప్రతినిధులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్ ధర్మకర్తల మండలి సభ్యులు మున్నా రాయల్, జయశ్యామ్,మల్లికార్జున్ రెడ్డి దేవస్థానం పి ఆర్ ఓ సిబ్బంది రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ వెంకటస్వామి, మరియు వైయస్సార్ సిపి నాయకులు కొండూరు నంద, భాస్కర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Invitation to Srikalahasti Devasthanam Brahmotsavam – Chairman of Srikalahastiswara Governing Council

Post Midle