చౌడేపల్లె ఎంపీడీఓ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం, మంత్రి కు ఆహ్వానం
చౌడేపల్లె ముచ్చట్లు:
చౌడేపల్లె లో సుమారు రూ:3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎంపీడీఓ , తహసీల్దార్ కార్యాలయ కాంప్లెక్స్ల ప్రారంభోత్సవానికి రావాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు ఆహ్వానించారు. బుధవారం పుత్తూరులో నారాయణస్వామిను, తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు. చౌడేపల్లెలో ఈనెల 19న బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు బహిరంగ సభకు హాజరుకావాలని ఆహ్వానపత్రికను అందజేశారు. అలాగే చిత్తూరులో డిఆర్వో మురళి, జెడ్పిసీఈఓ ప్రభాకర్‌రెడ్డి,డ్వామా పీడీ చంద్రశేఖర్, పిఆర్ ఎస్‌ఈ అమరనాథరెడ్డి,లతో పాటు జిల్లా స్థాయి అధికారులకు ఆహ్వానపత్రికులు అందజేశారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Invitation to the Deputy CM, Minister for the inauguration of the Choudepalle MPDO Complex