శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల, క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల, క‌ళాశాల‌లో 2022 – 23 విద్యాసంవత్సరమునకు మూగ, చెవిటి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.ఎస్వీ బధిర ఉన్నత పాఠశాలలో 1 నుండి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు, క‌ళాశాల‌లో ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం సిఇసి మ‌రియు హెచ్ఇసి గ్రూపుల‌లో అడ్మిష‌న్లు పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థులు జూలై 20వ తేదీ వరకు ద‌రఖాస్తులను స్వయంగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ అందజేయవచ్చు.ఇతర వివరములకు బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని ఫోన్‌ నెంబరు – 0877-2264616 సంప్రదించగలరు.

 

Tags:INVITING APPLICATIONS FOR ADMISSION IN SRI VENKATESWARA BADHIRA HIGH SCHOOL AND COLLEGE

Leave A Reply

Your email address will not be published.