అపూర్వకలయిక
– 18 యేళ్ల తరువాత ఏకమైన పూర్వపు విద్యార్థులు
– బోయకొండలో వేదికగా ఏకమయ్యారు
చౌడేపల్లె ముచ్చట్లు:

వారందరూ2004-2005 వసంవత్సరంలో అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె తుమ్మలపల్లె ఉన్నత పాఠశాలలో పదోవతరగతి వరకు క లిసి చదువుకున్నారు. 18 యేళ్ల తరువాత శుక్రవారం వారందరూ ఏకమైయ్యేందుకు బోయకొండ అమ్మవారి ఆలయం వేదికగా మారింది. ఆనాటి సంఘటనలను స్మరిస్తూ ఆప్యాయతా పలకరింపుల నడుమ వీరి కలయిక జరిగింది.అమ్మవారిని దర్శనార్థం చిన్నతనంలోని తీపి జ్ఞాపికలను స్మరిస్తూ…. ఎవరెవరూ ఎక్కడ స్థిరపడ్డారో…కష్ట సుఖాలను చర్చించుకొన్నారు. తాము చదివిని పాఠశాలను అభివృద్దిచేయడంతోపాటు పేదలకు సేవ చేయడమే తమ ధ్యేయమని చౌడేపల్లె ఏఆర్‌ఐ సుధాకర్‌నాయక్ పేర్కొన్నారు. ఆనందోత్సవాల నడుమ ఉల్లాసంగా గడిపారు.
Tags: Involuntary
