సిమ్స్ లో వైద్య పరికరాల కోసంఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం
– ఈఓ సమక్షంలో ఎంఓయు
తిరుపతి ముచ్చట్లు:
సిమ్స్ లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారులు ఎంఓయు కుదుర్చుకున్నారు.ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, సిమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జేఈవో సదా భార్గవి, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో బాలాజీ, సిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఐఓసీఎల్ ఎపి, తెలంగాణ ఇంచార్జ్ అనిల్ కుమార్, రాయలసీమ రీజనల్ హెడ్ రోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:IOCL donates Rs.22 crore for medical equipment in Sims
