. ఐపీఎల్ సందడి షురూ…

Date:21/03/2018
ముంబై  ముచ్చట్లు:
వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల 11వ సీజన్ సందడి మొదలైంది. శ్రీలంకలో ముక్కోణపు  ట్రై సిరీస్ తర్వాత స్వదేశానికి చేరుకున్న భారత  క్రికెటర్లు  ఒకటి రెండు రోజుల విరామం తర్వాత తమతమ జట్లతో ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సీజన్ కోసం మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.  కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఇంకా జట్టుతో చేరనప్పటికీ వైస్ కెప్టెన్ రాబిన్ ఊతప్ప, మిగతా ఆటగాళ్ల బృందం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానంలో కసరత్తు ప్రారంభించింది. ఈ జట్టులో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందంలోని సభ్యులు శుభ్‌మన్ గిల్, నాగర్ కోటి, వినయ్‌కుమార్, ఇషాంక్ జగ్గీ తదితరులున్నారు. మాజీ కెప్టెన్ గంభీర్ ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆ స్థానంలో దినేశ్ కార్తీక్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.  బుధవారం నుంచి కార్తీక్ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.  ఏప్రిల్ 8న   ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో  కోల్‌కతాలో పోటీపడుతుంది.ఈ ఏడాది ఐపీఎల్ కింగ్స్ లెవెన్  పంజాబ్ సొంతగడ్డపై ఆడే మ్యాచ్ వేదికల్లో మార్పులు జరిగాయి.  మే 12 నుంచి 31 వరకు చండీగఢ్ విమానాశ్రయాన్ని మరమ్మతుల కారణంగా మూసేస్తున్నారు. దీంతో మొహాలీలో మే 4,6,12,14 తేదీల్లో   కింగ్స్ లెవన్ పంజాబ్ ఆడే మ్యాచ్‌లను  ఇండోర్‌లో నిర్వహించను న్నారు. ఈ వేదికల మార్పు నకు అనుమతివ్వాలన్న పంజాబ్ జట్టు అభ్యర్థనకు ఐపీఎల్ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇక ఏప్రిల్ 15, 19, 23న జరిగే మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని, ఆ మ్యాచ్‌లన్నీ మొహాలీలోనే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కింగ్స్‌లెవెన్ పంజాబ్ జట్టుకు ఈ ఏడాది అశ్విన్ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్‌ను పంజాబ్ జట్టు  ఏప్రిల్8న  ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడుతుంది.ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి గడువు దగ్గరపడుతుండటంతో  ఆయా జట్ల ఫ్రాంఛైజీలు బిజీ అయిపోయాయి. ఇప్పటికే విడుదలైన ఐపీఎల్ ప్రచార గీతానికి విశేష ఆద రణ దక్కింది. అలాగే పలు ఫ్రాంఛైజీలు కూడా సొంత ప్రచార గీతాలు విడుదల చేశాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదారాబాద్ తన ప్రచార గీతాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. గో గో గో గో హియర్ వి గో గో గో… వియ్ ఆర్ ది ఆరెంజ్ ఆర్మీ అంటూ సాగే ఈ ప్రచార గీతం విశేషంగా ఆకట్టుకుంది.  సోషల్ మీడియాలో  ఈ ప్రచార గీతం హోరెత్తుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఏప్రిల్ 9న ఈ మ్యాచ్ జరగనుంది.మరో వైపు రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది.  మంగళవారం మొదలైన ఆరు రోజుల శిక్షణ శిబిరంలో రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు  సర్ఫరాజ్ ఖాన్, పార్థివ్ పటేల్, మనన్ వోహ్రా, కుల్వత్ ఖెజ్రోలియా, అశ్విన్, పవన్ నేగి, దేశ్ పాండే లాంటి యువ ఆటగాళ్లు  పాల్గొన్నారు.  కోచ్ వెటోరీ సారథ్యంలో మొదలైన ఈ శిక్షణ శిబిరంలో  మరికొంత మంది ఆటగాళ్లు రేపటిలోగా చేరనున్నారు.
Tags:IPL lunch shuru …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *