సీఎం వైయస్ జగన్ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు
అమరావతి ముచ్చట్లు:
శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు ఐపీఎస్ అధికారులు మంగళవారం నాడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ ను కలిసారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్థను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ సీఎం వారికిమార్గనిర్ధేశం చేసారు. ఆల్ ద వెరీ బెస్ట్ చెపపారు. యువ ఐపీఎస్లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్ళి, సునీల్ షెరాన్, రాహుల్ మీనా సీఎం ను కలిసారు.
Tags: IPSs who completed training met CM YS Jagan

