రైలు పట్టాలపై ఇనప రాడ్డు..శబరికి తప్పిన ప్రమాదం
గుంటూరు ముచ్చట్లు:
శబరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియను దుండగులు గుంటూరు సెక్షన్లో పట్టాలపై ఇనుప రాడ్డుకట్టారు. హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్ లక్ష్యంగా నల్లపాడు-గుంటూరు సెక్షన్లో పట్టాలపై ఇనుపరాడ్డును కట్టినట్లు గుర్తించారు. అయితే లోకోపైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్లో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. దీంతో రైలు తిరిగి బయలుదేరింది.
Tags: Iron rod on railway tracks..Sabari missed accident

