నెల్లూరులో ఇర్రి బృందం పర్యటన

Irrice tour tour in Nellore

Irrice tour tour in Nellore

Date:03/03/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఫిలిఫ్ఫైన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి) డైరెక్టర్ జనరల్ మాథ్యూ మోరెల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి బృందం ఫిలిఫ్ఫైన్స్, వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏపీలో రీజనల్ ఇన్నొవేటివ్ సెంటర్ (వినూత్న ఆవిష్కరణ కేంద్రం) ఏర్పాటు చేసేందుకు ఆ పర్యటనలో ఇర్రితో ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఈ బృందం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు  తో సమావేశమైంది.  ప్రస్తుతం ఇలాంటి కేంద్రం ఉత్తర భారతదేశంలోని వారణాసిలో ఉంది. దేశంలోనే రెండోదైన ఇన్నొవేటివ్ సెంటర్ ను ఇరీ భాగస్వామ్యంతో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలమైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇర్రి శాస్త్రవేత్తల బృందం పర్యటించింది.
జిల్లా అధికారులతో సమావేశం
మాథ్యూ మోరెల్ నేతృత్వంలోని బృంధం శనివారం ఉదయం నెల్లూరులో జిల్లా అధికారులతో సమావేశమైంది. ఏపీఐఐసీ చైర్మన్ పి.కృష్ణయ్య, కలెక్టర్ ముత్యాల రాజు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్ నాయుడు, ఆర్డీఓ పి.హరిత, ఏపీఐఐసీ జెడ్ఎం కె.వెంకటేశ్వరరావు, డీడీఏ శివనారాయణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇర్రి కార్యకలాపాలను శాస్త్రవేత్తలు వివరించగా వరి సాగుతో పాటు నూతన ఆవిష్కరణలకు నెల్లూరులో ఉన్న విశిష్టతలను, వరితో నెల్లూరుకు ఉన్న అనుబంధాన్ని కృష్ణయ్య , ముత్యాలరాజు  వివరించారు.
భూముల పరిశీలన
రీజనల్ ఇన్నవేటివ్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమైన భూములను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. మొదట కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలోని భూములను పరిశీలించారు. ఇక్కడ ఉన్న అనుకూలతలపై అధికారులతో చర్చించారు. దగ్గరలో జాతీయ రహదారి ఉండటంతో పాటు నెల్లూరుకు ఆనుకునివున్న ప్రదేశమని, పక్కనే పెన్నానది కూడా ఉందని అధికారులు వివరించారు. అనంతరం శాస్త్రవేత్తల బృందం ముత్తుకూరు మండలం నారికేళపల్లి పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించింది. మొదట అక్కడ రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను పరిశీలించి దిగుబడులపై చర్చించారు.
ఏఆర్ఎస్ లో శాస్త్రవేత్తల బృందం
భూముల పరిశీలన అనంతరం శాస్త్రవేత్తల బృందం నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం(ఏఆర్ఎస్)ను సందర్శించింది. రైస్ మ్యూజియంను సందర్శించడంతో పాటు ఏఆర్ఎస్ లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలను స్థానిక శాస్త్రవేత్తల నుంచి తెలుసుకున్నారు. నూతన వంగడాల ఆవిష్కరణల ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. నెల్లూరు శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వంగడాల విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం ఇర్రి శాస్త్రవేత్తలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్ నాయుడు ఘనంగా సత్కరించారు.
Tags: Irrice tour tour in Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *