రబీ పంటలకు సారు నీరివ్వండి
కర్నూలు ముచ్చట్లు:
తెలుగుగంగ ఆయకట్టు క్రింద రబీ లో వేసుకున్న పంటలకు సాగునీరు అందించాలని వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు విచ్చేసిన పి.ఏ.సి కమిటీ కి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వినతి పత్రాన్ని పి.ఏ.సి చైర్మన్ పయ్యావుల కేశవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పిన మాటలు నమ్మి వెలుగోడు, బండి ఆత్మకూరు మరియు మహానంది మండలాల్లో ఇప్పటికే 15వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని పి.ఏ.సి కమిటీ, జిల్లా అధికారుల దృష్టికితీసుకెళ్లారు. తెలుగుగంగ రిజర్వాయర్ లో 12 టి.ఎం.సి ల నీరు ఉన్నప్పటి నుంచి తాము ఎన్ని విజ్ఞప్తులు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం రిజర్వాయర్ లో ఉన్న 6 టీఎంసీ ల నీటిని అయిన క్రిందకు విడుదల చేయకుండా నిలుపుదల చేసి ఇప్పటికే వేసుకున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కోరారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Irrigate rabi crops