సాగునీరు కరువాయే

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ శివారు గ్రాంటు గ్రామంలో వరి పంటకు సాగు నీరు అందక ఉప్పు నీరు తోడుతున్న పరిస్థితి నెలకొంది. సుమారు 500 యకరాలకు సంబంధించిన సాగు మరియు త్రాగు నీరు సంబంధించిన పంటకాలువ పూర్తిగా తూటు మరియు నాచుతో మూసుకుని పోవడం తో పత్తిగొంది డ్యామ్ నుంచి గ్రాంటు గ్రామానికి చుక్కనీరు రానిపరిస్థితి , మొన్న కురిసిన భరీ వర్షాలు, వరదలు వలన ఆకుమడులు పోయిన సంగతి అందరికీ తెలిసిందే, రెండవసారి వేసుకున్న ఆకుమడులు కు సాగునీరు అందక ఈరోజు సుమారు 75 మంది రైతులు శ్రమదానం తో పంటబోది శుబ్రం చేసుకుంటున్నారు, ఈలోపు వేసిన నారుమడులు కు ఎండలు తీవ్రంగా వుండడంతో పంట కాలువలో పోటుకు ఎక్కిన సెలనీటి రెండు, మూడు శాతం వున్న ఉప్పు నీరు తోడుకుంటున్నామని రైతులు పితాని సత్తిబాబు, దంతులూరి వర్మ, సూరంపూడి సూరిబాబు, రాయుడు సింహాచలం తెలియజేశారు, ఈ సందర్భంగా పంటకాలువ ను పరిశీలించిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు ధూళిపూడి వెంకటరమణ(బాబి) మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రైతులు ను ఆదుకోవాలని , ఇంజన్లు సహాయం తో నీరు తోడుకుంటున్న రైతులకు ఉచితంగా ఆయిల్ ఇవ్వాలని , అధిక వర్షాలు కారణంగా పాడైపోయిన ఆకుమడులు కు ఖర్చులు కింద యకరానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు , ఈ కార్యక్రమంలో రైతులు సీతారామరాజు, రాయుడు వీర్రాజు, బాదం సత్యనారాయణ, అర్జునరావు , పిల్లిశ్రీనివాస్, కావూరి వెంకన్న , కాద సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Irrigation is scarce

Leave A Reply

Your email address will not be published.