బీహార్ లో నవంబర్ లో  ఎన్నికలు సాధ్యమేనా

Date:07/08/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

బీహార్ లో ఎన్నికలు జరపడం పై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది అక్టోబరు నెలలో బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఈ నెలాఖరులో బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా తీవ్రత కారణంగా ఎన్నికల కమిషన్ కూడా బీహార్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. 2015లో ఎన్నికలప్పుడు కమిషన్ సెప్టంబరు నెలలో షెడ్యూల్ ను విడుదల చేసింది.2015లో సెప్టంబరులో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా, నవంబరులో ఫలితాలు వచ్చాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి గత ఎన్నికల్లో ఐదు దశల్లో పోలింగ్ ను నిర్వహించారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఐదు దశల్లో ఎన్నికలను నిర్వహించారు. ఈసారి కూడా ఐదు దశల్లోనే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటం కూడా ఇందుకు కారణం. దాదాపు 47 నియోజకవర్గాల్లో మావోయస్టుల ప్రభావం ఉంటుందిఅయితే ఈసారి బీహార్ ను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది. కరోనా వైరస్ ఇప్పట్లో ఆగే సూచనలు కన్పించడం లేదు.

 

 

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిపేందుకు కొన్ని ఆలోచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు, పోలింగ్ దశలను కూడా పెంచడంతో ప్రజలు భౌతిక దూరం పాటించే వీలుంటుందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. కానీ ఈవీఎంలు సేఫ్ కాదన్న విమర్శలు వచ్చాయి. వాటి ద్వారా కూడా కరోనా సోకే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికతో కేంద్ర ఎన్నికల కమిషన్ పునరాలోచనలో పడింది.అందుకోసం అన్ని రాజకీయ పార్టీల అభప్రాయాలను సేకరించింది. అయితే అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ మినహా అన్ని పక్షాలూ బీహార్ లో ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాయి.

 

 

 

కరోనా వైరస్ తీవ్రంగా ఉండటంతో పాటు వరదల వల్ల కూడా రాష్ట్ర ఇబ్బంది కర పరిస్థితిని ఎదుర్కొంటుందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలని అన్ని పక్షాలు కోరాయి. చివరకు బీజేపీ మిత్రపక్షమైన ఎల్పీజీ కూడా ఎన్నికలను వాయిదా వేయమనే కోరింది. కాంగ్రెస్, ఆర్జేడీలు సయితం ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరి ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకుటుందో చూడాలి.

 విశాఖకు జై కొడుతున్న గోదావరి వాసులు..

Tags: Is elections possible in Bihar in November?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *