ఆ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నా

Date:13/01/2021

ముంబై ముచ్చట్లు:

ఓ మహిళను ఉద్దేశించి మంత్రి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. తనపై వచ్చిన అత్యాచార ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ మ‌హారాష్ట్ర సామాజిక‌, న్యాయ‌ శాఖ మంత్రి ధ‌నంజ‌య్ ముండే త‌న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు. త‌న‌పై ఫిర్యాదు చేసిన 38 ఏళ్ల మ‌హిళ‌తో తాను రిలేష‌న్‌లో ఉన్నట్లు తెలిపారు. 2008 నుంచి ఆమెతో రిలేషన్‌లో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మంత్రి ధనంజయ్ చెప్పారు. ఆ విషయం తమ కుటుంబసభ్యులకు కూడా తెలుసునన్నారు. ఆమెను రేప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు.బాధితురాలితో పాటు ఆమె సోద‌రి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని మంత్రి ధనంజయ్ తెలిపారు. తన నుంచి డ‌బ్బులు రాబ‌ట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు.మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం దుమారం రేపుతోంది. ధ‌నంజ‌య్‌ ముండే ఎన్సీపీలో కీలక నేతగా ఉన్నారు. మహిళతో రిలేష‌న్‌లో ఉన్నట్లు ఆయన అంగీక‌రించ‌గానే.. బీజేపీ మ‌హిళా విభాగం నేత‌లు ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Is in a relationship with that girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *