రాష్ట్ర ప్రభుత్వానికి  వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలనడం బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..?      ఎంపీ ఓవైసీ‌పై మండిపడ్డ బీజేపీ నాయకురాలు విజయశాంతి

హైదరాబాద్  ముచ్చట్లు :
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ‌పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ ప్రధాని మోదీపై అసద్ చేసిన విమర్శలను తిప్పి కొడుతూ.. విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ, ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. 2020 జూలైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్‌కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా..? 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్‌కి ఇవ్వటం వీఐపీ కల్చర్ అయితే… టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి  వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..? ఒవైసీ గారు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారు? ప్రధాని మోదీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారు’’ అంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయశాంతి ప్రస్తావించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Is it for the black market culture to buy the vaccine from the state government ..?
BJP leader Vijayashanti angry over MP OYC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *