సైకిల్ కి రిపేర్ సాధ్యమేనా

Date:15/02/2020

విజయవాడ ముచ్చట్లు:

గత ఎన్నికల షాక్ నుంచి చంద్రబాబు అండ్ పార్టీ ఇప్పటికి కోలుకోలేదు. చంద్రబాబు సారధ్యంలో చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాజయం మూటగట్టుకున్న టిడిపి ఇప్పటికి ప్రజలకు పూర్తిస్థాయిలో ముఖం చూపించలేక అరకొరగా మాత్రమే జనంలోకి వస్తున్నారు. అయితే త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి విపక్షం దిగే ఘడియలు సమీపించాయి. ఇప్పటివరకు అమరావతి లో రైతులతో మమేకం అయ్యి ఉద్యమిస్తూ క్షణం తీరికలేని చంద్రబాబు ఇక దానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి బస్సు ఎక్కేందుకు డిసైడ్ అయిపోయారు.

 

 

 

నాలుగు పదుల వయసులో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా వున్న తనకు చెమటలు పట్టించడంతో చంద్రబాబు బస్సు యాత్రే తమ కి దారిచూపిస్తుందని గట్టిగా నమ్ముతున్నారట.ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు ఇప్పుడు అర్జెంట్ గా చుట్టివచ్చేయాలి. బలహీనపడి నిరాశ నిస్పృహలో వున్న క్యాడర్ లో ధైర్యం నూరిపోసి కార్యోన్ముఖుల్ని చేయాలి. దిశా, దశా చూపి స్థానిక ఎన్నికల్లో పరువు నిలుపుకుని తమ పార్టీ క్లోజ్ చేస్తామని చెబుతున్న అధికారపార్టీకి గట్టి షాక్ ఇవ్వాలి. అదే ఇప్పుడు టిడిపి అధినేత లక్ష్యం. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది.

 

 

 

 

తన ముఖ్య అనుయాయులు అయిన అయ్యన్నపాత్రుడు, కరణం బలరాం వంటివారితో ఇప్పటికే నేతల నీరసం, బద్దకాన్ని వదిలించేలా స్ట్రాంగ్ కౌంటర్ లు కొట్టించారు ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు.పార్టీ కార్యక్రమాలు ఇచ్చినా పెద్దగా నేతలు పాల్గొనడం లేదు. కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నివేదికలు చూసి పదమూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పడకేసిందని చంద్రబాబు గుర్తించారు. అందుకే నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా జోష్ నింపాలన్న ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నారు. పార్టీలో జోష్ నింపేందుకు శ్రేణులను సిద్ధం చేసేందుకు సీనియర్లు చావో రేవో తేల్చుకునేందుకు స్థానిక ఎన్నికల్లో పోరాడేందుకు సైకిల్ కి రిపేర్లు మొదలయ్యాయి. అయితే ఎపి చంద్రుడి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి

రెండు పార్టీల మధ్య సెలక్షన్ కమిటీ రచ్చ

Tags: Is it possible to repair the bicycle?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *