Natyam ad

అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే సామాజిక అసమానత్వమా..

వెలగపూడి ముచ్చట్లు:

చంద్రబాబూ మా పేదలంటే నీకెందుకంత కక్ష్య..పేదలు నీ బానిసలుగా బతకాలన్నదే నీ లక్ష్యమా..
మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే సామాజిక అసమానత్వం వస్తుందని చంద్రబాబు మాట్లాడటం దారుణమని, పేదలంటే నీ బానిసలుగా ఉండేవారు కాదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకే పెద్దపీట వేశామని పేదరికం నుంచి వారిని బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చంద్రబాబు మాట్లాడటం చంద్రబాబులోని కుల అహంకారం.. పెత్తందారీ మనస్తత్వానికి ప్రతీక అని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రోద్భలంతోనే కొందరు పెత్తందారులు కోర్టుల్లో కేసులు వేశారని, సుప్రీం కోర్టు తీర్పు టీడీపీ నేతలకు చెంపచెట్టుగా మారిందని విమర్శించారు.

 

 

 

Post Midle

దళితులు, అమరావతిలో పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లపై ఇటీవల జరిగిన రోడ్ షోలో చంద్రబాబు చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలపై మంత్రి మేరుగా సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలు సొంత ఇళ్లు, సంక్షేమ పథకాలతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు తన బినామీలు, పెత్తందారులతో కలిసి పేదలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. కులాలు, పేదలు అంటూ సమాజంలో విష పూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇటీవల పెందుర్తిలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను శవాలు పూడ్చడానికి కూడా చాలవని హేళన చేయడం పేదలను అవమానించడమేనన్నారు. చంద్రబాబుకు అహం తలకెక్కిందని అందుకే మా పేదల ఇళ్లు స్మశానాలంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలను అవమానించే చంద్రబాబుకు రాజకీయ నాయకుడిగా ఎలాంటి అర్హత లేదని విమర్శించారు. టీడీపీ రాజకీయం పేదలు, బహుజనుల వ్యతిరేకిగా సాగుతోందన్నారు.

 

 

 

పేదలంటే నీ బానిసలుగానే ఉండాలా చంద్రబాబూ..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మొదటి మూడేళ్లు కనీసం పేదలకు సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో పేదల గురించి ఆలోచించిన దాఖలాలే లేవన్నారు. ఇంతే బడ్జెట్ ఉన్న ఐదేళ్లు ప్రభుత్వ ఖజానాను తన పెత్తందారులకు దోచి పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తుంటే విషం చిమ్ముతున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు మా పేదలు మీ ధనిక పెత్తందారీలకు ఊడిగం చేయాలో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకెన్నాళ్లీ కుల రాజకీయాలు చేస్తూ పార్టీని నడుపుతావని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళిత, బహుజన, బీసీ, మైనార్టీ వ్యతిరేకిగా ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో వేల కోట్లు కాజేసి ప్రజలకు చేరాల్సిన డబ్బును బినామీల పేరుతో మింగేశారని, ఇప్పుడు అదే డబ్బు పేదలకు ఇస్తుంటే ఓర్వలేక పెత్తందారీలను పోగేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 2014 లో పేదలు, బడుగు బలహీన వర్గాలు టీడీపీని గెలిపిస్తే చివరికి వాళ్ల తోకలే కత్తిరిస్తానని అనడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు. రాబిన్ హుడ్ ఫార్ములాలకు చంద్రబాబు వ్యతిరేకి అని పేదలను కొట్టి పెత్తం దారీలకు పెట్టడమే ఆయన పాలసీ అని విమర్శించారు.

 

 

 

వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది పేదల పక్షపాతమే..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని, పేదలకు మరింత మంచి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వివరించారు. చంద్రబాబుకు బహిరంగంగా సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నాది పెత్తందారీల పక్షమే అని చెప్పు ఎన్నిలకు వెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగే ఈ క్లాస్ వార్ లో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పదని, పేదలను బానిసలుగా మార్చాలనుకునే చంద్రబాబుకు ఆ పేదలే తగిన బుద్ది చెబుతారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ చేస్తున్న రోడ్ షోలు పనిచేయట్లేదని ఎద్దేవా చేశారు. బాబొస్తే జాబోస్తుందన్న 2014 ఎన్నికల మేనిఫెష్టోలో ఒక్కటైనా అమలు చేసావా.. ఇప్పుడు అదే ప్రశ్న పేదలు అడిగితే ఏం చెప్తారని ప్రశ్నించారు. మోసకారి, దగాకోరు, పేదలను అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబును రాజకీయాల్లో ఉంచాలా అన్న విషయం ప్రజలు ఆలోచించాలని విజ్ణప్తి చేశారు.

Tags: Is it social inequality if there is housing for the poor in Amaravati?

Post Midle