మళ్లీ వలసలు తప్పవా

హైదరాబాద్ ముచ్చట్లు:


కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణా కాంగ్రెస్  ఆత్మరక్షణలో ఉండ‌గా మ‌రోవంక సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం అంత‌కు మించి అన్న‌ట్టు త‌యార‌యింది. నిత్యం వార్త‌ల్లో ఉండే జ‌గ్గారెడ్డి గ‌త కొన్ని రోజులుగా మౌనం వ‌హించారు. క‌నీసం గాంధీభ‌వ‌న్ మెట్ల‌న్నా ఎక్క‌డం లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో స‌మావేశం త‌ర్వాత జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హార శైలిలో ఊహించ‌ని మార్పే వ‌చ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. పార్టీ అధినేత‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నందువ‌ల్ల పార్టీ విష‌యాలు మీడియాకు చెప్పన‌ని పేర్కొన్న ఆయన అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలకు దూరం దూరంగానే ఉంటున్నారు. కాగా ఆమ‌ధ్య పార్టీ ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటితే త‌ల గోడ‌కేసి కొడ‌తాన‌ని రేవంత్ రెడ్డి అన‌డం జ‌గ్గారెడ్డిని ఆగ్ర‌హానికి ఆజ్యం పోసిన‌ట్ట‌యింది. య‌శ్వంత్ సిన్హాను క‌లిసిన వి.హ‌నుమంత‌రావును ఉద్దేశించే రేవంత్ ఆ విధంగా నోరుపారేసుకున్నాడ‌ని జ‌గ్గారెడ్డి ఘాటుగానే విమ‌ర్శ‌చేశారు. జ‌గ్గారెడ్డి మౌనం మ‌రింత విస్త‌రించి ఏకంగా మాణికం ఠాకూర్ తో పీసీసీ నాయ‌కుల‌ స‌మావేశానికి కూడా హాజ‌రు కాలేదు. అంతెందుకు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పార్టీ ఎమ్మెల్యేల‌తో కాకుండా ఆయ‌న విడిగా ఆఖ‌రి నిమిషంలో వ‌చ్చి ఓటేసి వెళ్లిపోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అస‌లు ఆయ‌న ఏం చేయ‌బో తున్నారు? ఆయ‌న ఏం చెప్ప‌బోతున్నార‌న్న‌ది ఇప్ప‌టికీ అంద‌రికీ ఓ ప‌జిల్ గానే ఉంది.

 

 

 

 

సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజ రైన రోజు కూడా హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలో పాల్గొనకుండా  జగ్గన్న సంగారెడ్డిలో నిరసన దీక్ష చేశారు. ఈయ‌న కూడా ఏదైనా పిడుగు లాంటి మాట చెబుతార‌మోన‌ని తెలంగాణా పిసిసి నాయ‌కులు ఖంగారుప‌డుతున్నారు.మరో వైపు కొద్దితేడాతో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా  తెరాసాకు పిడగు పాటు వంటి కబురు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఎందుకంటే, ఆయ‌న కొంత‌కాలం నుంచి బీజేపీ లో చేరుతార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగానే విన‌వ‌స్తోంది. త్వ‌ర‌లో బీజేపీలో చేర‌డానికి ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి, టీఆర్ ఎస్ నేత ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు సిద్ధంగా ఉన్నార‌న్న స‌మాచారం. వీరితో పాటు కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ పార్టీలకు చెందిన కీల‌క‌నేత‌లు కూడా క్యూ కట్ట‌వ‌చ్చ‌ని వార్త‌లు ప్రచారంలో ఉన్నాయి.తెలంగాణా రాజ‌కీయ‌ రంగం వేడెక్కిన త‌రుణంలో కేసీఆర్ ముంద‌స్తుకు సిద్ధ‌ప‌డితే తుమ్మ‌ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తు న్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.  ఏది ఏమైన‌ప్ప‌టికీ తెరాసకు   తుమ్మ‌ల‌, కాంగ్రెస్ కు జ‌గ్గారెడ్డి ఇద్ద‌రూ పిడుగులాంటి వార్త‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత వేడెక్కించి కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ పార్టీల‌కు పెద్ద ప‌రీక్ష పెట్ట‌బోతున్నార‌ని పరిశీలకులు అంటున్నారు.

 

Tags: Is it wrong to migrate again?

Leave A Reply

Your email address will not be published.