Natyam ad

ప్లాస్టిక్ నిషేధం మాటలేనా

అనంతపురం ముచ్చట్లు:


ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం కార్పోరేషన్‌తో పాటు హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, మున్సిపాలిటీలలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉంది. ఈ పట్టణాల్లో దాదాపు 10.45 లక్షల జనాభా ఉంది. రోజూ 422 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఈ చెత్తలో సుమారుగా 68 టన్నులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయని అధికారులే తెలిపారు. అంటే నెలకు 1,845 టన్నులు, ఏడాదికి సరాసరి 22 వేల టన్నులకు పైగా ప్టాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాల్లో వినియోగం సరేసరి. సుప్రీంకోర్టు తీర్పుమేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ వినియోగిస్తే పురపాలక శాఖ అధికారులు దాడులు చేసి జరినామా వేయవచ్చు. రూ.500 నుంచి రూ.5 వేలకుపైగా అపరాధ రుసుం విధించవచ్చని అధికారులే చెబుతున్నారు. అయినా దాడులు నామమాత్రంగానే జరుగుతున్నాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని పురపాలక సంఘాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సచివాయాల్లో పర్యావరణానికి ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమించినప్పటికీ ప్లాస్టిక్‌ నిషేధం పూర్తి స్థాయిలో అమలు కావాడం లేదు. అక్కడక్కడ పురపాలక సంఘాల్లో సచివాలయ పర్యావరణ కార్యదర్శులు బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించి, ప్లాస్టిక్‌ను పట్టుకున్నప్పటికీ వారికి విధించే జరిమానాలు తక్కువ ఉండడంతో వ్యాపారులు ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించడం లేదు. నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంలో పర్యావరణ కార్యదర్శులు నిర్లక్ష్యం విడిచి దాడులు నిర్వహిస్తే తప్పా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు కాని పరిస్థితి కన్పిస్తోంది.ప్లా

 

 

 

స్టిక్‌ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాల్వల్లో వేయడం వల్ల కాలువలకు అడ్డంపడి మురుగు రోడ్లపైకి చేరుతోంది. కల్వర్టులకు అడ్డంగా చేరి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దుకాణదారులు డ్రెయినేజీలపై బండలు వేయడంతో వాటి కింద ప్లాస్టిక్‌ ఇరుక్కుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ వినియోగం నిషేధం ఉన్నా.. అమలు చేయడంలో పురపాలక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దనే ఆరోపణలున్నాయి. ప్లాస్టిక్‌ వాడకం వల్ల భూతాపం పెరుగుతుందని పలు అధ్యయనాలు నిగ్గుతేల్చాయి. ప్టాస్టిక్‌ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రమాదకరమైన ‘కార్సినోజన్లు’ శరీరంలో చేరి క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతటి నష్టాన్ని చేకూర్చే ప్లాస్టిక్‌ వినియోగించకుండా ఉండేలా ప్రజల్లో అధికారులు చైతన్యం తీసుకురావాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు

 

 

 

Post Midle

.ప్లాస్టిక్‌ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసినా దాని వినియోగం మాత్రం తగ్గడం లేదు. 50 మైక్రాన్స్‌ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగకాలువలు ప్లాస్టిక్‌ కూపాలుగా మారుతున్నాయి. రోగాలు పెంచుతున్నాయి. ప్లాస్టిక్‌ను భూమిలో వేస్తే నేల కలుషితమవుతోంది. కాలిస్తే విషవాయువులు వాతావరణంలో కలిసి పర్యావరణం దెబ్బతింటోంది. జీవ మనుగడపై దుష్ప్రభావం కలిగించే ప్లాస్టిక్‌ నిషేధంలో నగర, పురపాలక సంస్థలు వైఫల్యం చెందాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

 

 

Tags:Is plastic ban a word?

Post Midle