బహిష్కరణ సహేతుకమేనా?

Is relegation reasonable?

Is relegation reasonable?

Date:11/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. పోలీసులకు ఆ రైట్స్ లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్లపై మాత్రమే ప్రయోగించే సెక్షన్లను వీరిద్దరిపై ఎలా ప్రయోగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫిల్మ్ క్రిటిక్.. కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందలను హైదరాబాద్ నుంచి బహిష్కరించడంతో.. సర్వత్రా ఇదే చర్చ. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే మహేష్ ను బహిష్కరించినట్లు చెప్పిన పోలీసులు.. పరిపూర్ణానంద విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. ఇతరులకు ఇబ్బంది కలిగించని రీతిలో.. సమాజంలో కల్లోలం రేకెత్తించని విధంగా.. నచ్చిన మతాన్ని అవలంబించే హక్కు ప్రజలకు ఉంది. ఓ మతం విశ్వాసాలు, నమ్మకాలను కించపరిస్తే.. ఆ మతం పాటించేవారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది సమాజంలో అశాంతికి, కల్లోలానికి దారితీయొచ్చు. కత్తి మహేష్ అనుచితి వ్యాఖ్యలు చేసింది దేశంలోని మెజార్టీ ప్రజల ఆరాధ్యదైవం కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు అంటున్నారు. వీరి ఆందోళనకు తగ్గట్లే స్వామి పరిపూర్ణానంద కత్తి కామెంట్స్ కు వ్యతిరేకంగా ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలనుకున్నారు. దీంతో ఈ అంశం గాలివానగా మారకముందే.. చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో పరిపూర్ణానంద స్వామిపైనా బహిష్కరణ వేటు వేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు చెప్తున్నారు. నాలుగేళ్లుగా..హైదరాబాద్ శాంతంగానే ఉంది. పైగా.. ఎన్నికల వాతావరణం నెమ్మదిగా పుంజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ అయితే.. ముందస్తుకు ఎలక్షన్ కు సై అంటోంది. ఈ నేపథ్యంలో.. మత అంశాలపై చిచ్చు రేగితే.. ఆ ఎఫెక్ట్ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక సున్నితమైన ఈ వివాదానికి ప్రారంభంలోనే చెక్ పెట్టకపోతే అశాంతి రేగే అవకాశాలూ ఉన్నాయన్న ఉద్దేశాలతోనే.. హైదరాబాద్ పోలీసులు.. కత్తి మహేష్,స్వామి పరిపూర్ణనందలపై బహిష్కరణ వేటు వేశారు.
బహిష్కరణ సహేతుకమేనా? https://www.telugumuchatlu.com/is-relegation-reasonable/
Tags:Is relegation reasonable?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *