ప్రగతి భవన్‌ ఎదుట కన్నీళ్లు పెడుతున్నా కనికరం లేదా?

–  సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

 

హైదరాబాద్‌  ముచ్చట్లు:

 

 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్టాఫ్‌ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి’’ అని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరోనా సమయంలో స్టాఫ్‌ నర్సులను దేవుళ్లని పొగిడారని, ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్‌ ఎదుట కన్నీళ్లు పెడుతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ లేఖలో.. ‘‘ ఉద్యోగాలు తొలగించి 1640 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రగతిభవన్‌కు వస్తే 5 నిమిషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా?.. ప్రగతిభవన్‌.. ప్రజల కష్టాలు విని కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా?..లేక కల్వకుంట్ల ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కార్యాలయమా?.2018లో ఎంపికైన ఏఎన్‌ఎంలకు ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వట్లేదు. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్‌ ‘వన్స్‌మోర్‌’గా ఉందని పేర్కొన్నారు… ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, బిశ్వాల్‌ కమిటీ నివేదిక ఇస్తే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడమేమితని ప్రశ్నించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Is there no mercy in shedding tears in front of Pragati Bhavan?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *