స్పైసీ  లుక్ లో ఇషా

Date:21/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అప్పుడెప్పుడో నితిన్ సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో మెరిసింది ఇషా తల్వార్. నటించడానికి అవకాశం ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఇషా. ఆ సినిమా హిట్టు కూడా అయ్యింది కానీ.. ఇషాకు మాత్రం ఇక్కడ అవకాశాలు వెల్లువెత్తలేదు. ఆ హిట్టు నిత్యా మీనన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇషా మలయాళం, తమిళ, హిందీ సినిమాలతో బిజీ బిజీగానే ఉంది.అలాగే సోషల్ మీడియాలో కూడా మెరుస్తోందీమె. ఇన్‌స్టాగ్రమ్ లో తన ఫొటోలను పోస్టు చేస్తూ.. తన ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది. ఈ పరంపరలో తాజాగా ఇలాంటి లుక్ తో హాయ్ చెప్పింది ఇషా.గ్లామర్ డోస్ ను పెంచేసి.. తన పేరులో గల తల్వార్ ను లుక్స్ లోకి జత చేర్చి.. అబ్బాయిల గుండెల్లోకి సంధిస్తోంది ఇషా. “This in my head is some version of #kuchkuchhotahai !!!” అనే క్యాప్షన్ తో ఇషా ఈ పిక్ ను పోస్టు చేసింది.
Tags: Isha on the spicy look

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *