నిబంధనలు అతిక్రమించిన అకతాయిలు ఐసోలేషన్

పెద్దపల్లి ముచ్చట్లు :

 

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పెట్రొలింగ్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయి యువకులను పోలీసులు ఐసోలేషన్ కు పంపించారు. డీసీపీ  మాట్లాడుతూ.కరోనా వైరస్ భారీ నుండి ప్రజలను రక్షించడానికి పోలీస్ వారు రోడ్లపై ఉంటూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తుంటే  కొంతమంది బాధ్యత రాహిత్యం గా వ్యవహరిస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు.గల్లీల్లో,రోడ్లపై అనవసరంగా ఆకతాయిలు ఎంత చెప్పినా వినకుండా  తిరుగుతున్నారు.సుల్తానాబాద్ ఐసోలేషన్ కి తరలించే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి తరలించడం జరిగింది.ఇకపై ప్రతి రోజు ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిని  ఐషోలేషన్ వ్యాన్లో సుల్తానాబాద్ కి పంపించడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి నికిత పంత్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐ లు, ఎస్ఐ లు ఉన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags; Isolation of Akatayis in violation of the regulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *