Natyam ad

గాజాలో భూత‌ల దాడుల‌కు స‌న్న‌ద్ధ‌మైన ఇజ్రాయెల్

జెరూస‌లెం ముచ్చట్లు:

 

పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్‌ను తుద‌ముట్టించేందుకు గాజాలో భూత‌ల దాడుల‌కు ఇజ్రాయెల్ స‌న్న‌ద్ధ‌మైంది. గాజాపై భూత‌ల దాడుల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు వెల్ల‌డించారు. అయితే గ్రౌండ్ ఆప‌రేష‌న్ ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే వివ‌రాల‌ను ఆయ‌న స్ప‌ష్టం చేయ‌లేదు. నెత‌న్యాహు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి టీవీలో మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయ‌ల్ ద‌ళాలు ప్ర‌వేశించ‌డంపై ప్ర‌భుత్వ ప్ర‌త్యేక వార్ క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు.తాము గాజాపై భూత‌ల దాడుల‌కు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, అయితే గ్రౌండ్ ఆప‌రేష‌న్ ఎలా, ఎప్పుడు చేప‌డ‌తామ‌నే వివ‌రాలు తానిప్పుడు వెల్ల‌డించ‌లేన‌ని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వేలాది ఉగ్ర‌వాదుల‌ను మట్టుబెట్టింద‌ని ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని అన్నారు.కాగా, ఇజ్రాయెల్ ద‌ళాలు, పాల‌స్తీనా సాయుధ మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ మ‌ధ్య భీక‌ర పోరు ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేదు. ఇరు ప‌క్షాల మ‌ధ్య యుద్ధం బుధ‌వారం 18వరోజుకు చేరింది.గాజా స్ట్రిప్‌లో భూత‌ల దాడుల‌కు ఇజ్రాయెల్ సంసిద్ధ‌మవుతుండ‌గా వైమానిక దాడులు భీక‌రంగా సాగుతున్నాయి. హ‌మాస్ స్ధావ‌రాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ భద్ర‌తా ద‌ళాలు (ఐడీఎఫ్‌) రాకెట్ దాడుల‌తో విరుచుకుప‌డుతున్నాయి.ఇక అలెప్పో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేప‌ట్టింద‌ని సిరియ‌న్ స్టేట్ టీవీ వెల్ల‌డించింది. అలెప్పో అంత‌ర్జాతీయ విమానాశ్రయం ల‌క్ష్యంగా మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రం దిశ‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడుల‌కు తెగ‌బ‌డింద‌ని సిరియ‌న్ సైనిక వ‌ర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఎయిర్‌పోర్ట్ ర‌న్‌వే ధ్వంస‌మైంద‌ని సిరియా మీడియా తెలిపింది.

 

Post Midle

Tags: Israel prepares for demonic attacks in Gaza

Post Midle