ముక్కంటి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్

కాళహస్తి ముచ్చట్లు:


శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి శ్రీహరికోట ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్  శనివారం వచ్చారు. అయనకు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు దక్షిణ గాలి గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద  వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్వి-డి1 కి సంబంధించి  ఉపగ్రహ నమూనాను దేవదేవుడు,శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంలకు  మొదటి లాంచింగ్ చేయడం జరుగుతుందని శ్రీకాళహస్తీశ్వరుని, ఆదేవదేవుని ఆశీస్సులు తో విజయం సాధించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య  నిర్వహణ అధికారి సాగర్ బాబు ఆలయ డిప్యూటీవో కృష్ణారెడ్డి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్, ప్రసాద్ ఆలయ అధికారులు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: ISRO Chairman Somnath visited Mukanti

Leave A Reply

Your email address will not be published.