చంద్రుడిపై ఇగ్లూ కట్టే ఆలోచనలో ఇస్రో

ISRO in the idea of building igloo on the moon

ISRO in the idea of building igloo on the moon

Date:27/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాల్లో నూతన ఒరవడి సృష్టిస్తూ ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోన్న ఇస్రో రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులను చేపట్టనుంది. గతేడాది 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి చరిత్ర నెలకొల్పిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అతి తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలను విజయవంతం చేస్తోంది. తాజాగా మరో వినూత్న ప్రయోగానికి సిద్ధపడుతోంది. చంద్రుడిపై ఇగ్లూలు నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ‘చంద్ర నివాసాలు’గా పిలిచే వీటిని నిర్మాణాలకు రోబోలు, త్రీడి ప్రింటర్లు పంపనుంది. అంతేకాదు చంద్రుడిపై ఉండే పోలిన మట్టి, ఇతర పదార్థాలతోనే వీటిని నిర్మించనున్నారు. అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని లూనార్ టెర్రేయన్ టెస్ట్ ఫెసిలిటీ విభాగంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి నమూనాను త్రీడి ప్రింటర్ సాయంతో సృష్టించారు.ఇగ్లూ నిర్మాణాలకు సంబంధించి ఐదు నమూనాలు తయారుచేశామని, వీటి సాయంతో చంద్రుని ఉపరితలంపై నిర్మాణం చేపడతామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మిషన్ గురించి ఇంకా ప్రణాళికలు రూపొందించకపోయినా, ఇగ్లూ నిర్మాణాలను అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేయాలని ఇస్రో యోచిస్తోంది. అంటార్కిటికాలోని భారత ఏర్పాటుచేసిన స్థావరాల మాదిరిగానే చంద్రుడిపై ఇగ్లూలు నిర్మించినున్నట్లు ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎం అన్నాదురై తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై దీర్ఘకాలిక నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.అమెరికాతో సహా అనేక దేశాలు చంద్రుడిపై శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసి అందులో నుంచి పరిశోధనలు చేయాలని భావిస్తున్నాయి… ఇందులో భారత్ కూడా భాగస్వామి కావాలనుకుంటోందని అన్నాదురై అన్నారు. భవిష్యత్తులో వ్యోమగాములు భూ ఉపగ్రహాల మీదుకు వెళ్లి చాలా సమయం గడపాల్సి ఉంటుంది.. ఈ సమయంలో వారికి ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయపడటం, సురక్షితంగా ఉండటానికి ఇగ్లూలు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. అక్కడ వాతావరణానికి అనువైన సామగ్రితోనే ఇగ్లూలను నిర్మిస్తామని చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని సృష్టించే ప్రక్రియను స్పేస్ ఏజెన్సీ దాదాపు పూర్తిచేసిందని.. ఇది మొత్తం సుమారు 60 టన్నులు వరకు ఉంటుందన్నారు. అపోలో మిషన్ ద్వారా చంద్రుడి నుంచి తీకువచ్చిన నమూనాలతో పోల్చితే ఇది 99.6 శాతం సరిపోలిందని అన్నాదురై వ్యాఖ్యానించారు.
Tags: ISRO in the idea of building igloo on the moon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *