Natyam ad

మరో ప్రయోగానికి ఇస్రో రెడీ

నెల్లూరు ముచ్చట్లు:

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమయింది. శనివారం (నవంబరు 26)న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన అనుసంధాన ప్రక్రియను రెండు రోజుల క్రితం చేపట్టిన శాస్త్రవేత్తలు తాజాగా రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. శనివారం సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు.డిసెంబర్ నెలలో అగ్నికుల్ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. అలాగే 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ – మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామన్నారు. కాగా కౌంట్డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో 56వ ప్రయోగం. అలాగే ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే.

 

Tags: Isro ready for another launch

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.