మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో

నెల్లూరు ముచ్చట్లు:


ఆదివారం  ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ – డీ1 రాకెట్ ప్రయోగం జరగనుంది.   రాకెట్ ద్వారా ఈఓఎస్ -02, ఆజాదీశాట్ అనే ఉపగ్రహాలను ఇస్రో  నింగిలోకి పంపనుంది.  భూపరిశోధనల కోసం 137 కేజీల బరువైన ఈఓఎస్ 02 ఉపగ్రహం ఉపయోగపడనుంది.  భారత గ్రామీణ ప్రాంత విద్యార్థినిలు 8 కేజీల బరువైన ఆజాదీశాట్ ఉపగ్రహన్ని రూపొందించారు.  కొత్త వాహకనౌక ద్వారా శాస్త్రవేత్తలు తమ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.  ఇప్పటి వరకు పిఎస్ఎల్వీ రాకెట్ ల ద్వారా వందలాది ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. – మొదట సౌండింగ్ రాకెట్, ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీలను రూపొందించిన ఇస్రో,  అ  తర్వాత పిఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ ల ద్వారా ప్రయోగాలు చేసింది.

 

 

మార్క్ 3 వంటి బాహుబలి రాకెట్ ను రూపొందించి అనేక విజయాలను ఇస్రో సొంతం చేసుకుంది.  తాజాగా ఎస్ఎస్ఎల్వీ ద్వారా ప్రయోగాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు.  తక్కువ ఖర్చుతో తక్కువ ఎత్తులో 500 కేజీల లోపు బరువు కలిగిన ఉపగ్రహాల ప్రయోగం కోసం రాకెట్ తయారీచేస్తోంది.  2016 నుంచి రాకెట్ పై ద్రుష్టి పెట్టి ఇటీవల 30 కోట్ల వ్యయంతో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ను తయారుచేసింది. ఆదివారం పు ఉదయం 2.18 గంటలకు ప్రారంభం కానున్న కౌంట్ డౌన్, 7 గంటల పాటు  కౌంట్ డౌన్ నిర్విరామంగా కొనసాగనుంది. షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు.ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ , షార్ కి చేరుకున్నారు.

 

Tags: ISRO ready for another launch

Leave A Reply

Your email address will not be published.