పీహెచ్సీలలో సదరన్ సర్టీఫికేట్లు జారీ

Date:03/12/2019

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ,  పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉంది. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకలను ప్రవేశపెట్టింది. అధికారంలోకి రాగానే పెన్షన్ 3వేలకు పెంచడం జరిగింది. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ల జారీ లో ఇబ్బందుకు తలెత్తిన మాట వాస్తవమని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం త్వరలో సదరన్ సర్టిఫికెట్ ల జారీ ప్రక్రియను జిల్లా స్థాయి అన్ని నియోజకవర్గాల్లో అన్ని పి హెచ్ సి లలో ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. డిసెంబర్ 15 నుండి సర్టిఫికెట్ ల జారీ సులభతరం చేస్తున్నాం ఆ దిశగా జీవోను జారీ చేసామని అన్నారు.

 

టీటీడీ పాలకవర్గం పాపాలపుట్ట – ఓంకార్

 

Tags:Issuing Southern Certificates in PHCs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *