ఇస్టా సదస్సు తెలంగాణకు గర్వకారణం

– విత్తన భాండాగారంగా తెలంగాణ

 

Date:27/05/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

జూన్ 26 నుండి జులై 3 వరకు జరిగే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ సన్నాహక సమీక్ష జరిగింది. ఈ సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ  అంతర్జాతీయ విత్తన పరిశీలన అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ 32వ సదస్సు మొదటిసారి ఆసియాలో అందునా భారతదేశంలోని తెలంగాణలో జరగడం గర్వకారణం అని అన్నారు.  విత్తన భాండాగారంగా పేరొందుతున్న తెలంగాణ ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు విత్తనోత్పత్తికి ఎంతో అనుకూలం అని, దానికితోడు ఇక్కడ విత్తనోత్పత్తిపై పనిచేసే అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని,  అన్ని రకాల రవాణా మార్గాలు అందుబాటులో ఉండడం తెలంగాణ విత్తనోత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగడానికి దోహదపడుతున్నాయని మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

వ్యవసాయ నేపథ్య కుటుంబాల నుండి ఎదిగివచ్చిన తెలంగాణ ప్రముఖులను, జాతీయస్థాయిలో వ్యవసాయ రంగం బలోపేతం కోసం, రైతుల అభ్యున్నతి కోసం కృషిచేసిన వారిని   సదస్సుకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. సదస్సు నేపథ్యంలో ఎవరెవరిని ఆహ్వానించాలి,  రైతు సదస్సులు, సీడ్ రైతుల సమావేశాలు వంటి వాటిపై అధికారులతో సమీక్ష చేశారు. ఇస్టా సదస్సుకు తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ          ప్రిన్స్ పల్ సెక్రటరీ
పార్ధసారధి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి నిరంజన్ రెడ్డి గారికి వివరించారు. ఈ సంధర్భంగా మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, తెలంగాణ సీడ్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు హాజరయ్యారు.

 

కన్నుల పండుగగా 87వ అవ్వ వెండి రథోత్సవం

Tags: Ista seminar is proud of Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *