Natyam ad

ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష్య సాధింపే

– మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
 
నేను చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు దీక్షాస్థలిని మురిగినీటితో నింపేసిన వైనం చూస్తుంటే ఇది రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భూమ బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.
నంద్యాలలోవైసిపి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ కుశ్రీకారంచుట్టారని ఆయన అన్నారు .నంద్యాల పట్టణంలో టిడ్కో ఇళ్ల సాధనకు మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మునిసిపల్ కార్యాలయం సమీపంలో
శనివారం ఉదయం దీక్షను ప్రారంభించారు.దీక్ష ప్రారంభించిన కొద్దిసేపటికే నంద్యాల నియోజకవర్గ ప్రజలు బ్రహ్మానందరెడ్డికి మద్దతుపలికేందుకు అదికసంఖ్యలో తరలివచ్చారు.దీక్షాప్రాంతం భూమ
మద్దతుదారులతో కిటకిటలాడింది.వెంటనే సమాచారంచేరవలసిన చోటకు చేరిందేమో..ఒక్కసారిగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి..భూమా దీక్షాశిబిరం వైపుకు సంజీవనగర్ నుండి మునిసిపల్
కార్యాలయం మీదుగా చామకాలువలో కలిసే ప్రదాన డ్రయినేజి కాలువ ఓక్కసారిగా పొంగిపొర్లింది..దీక్షాశిబిరం వైపుకు మురుగునీరు ఓక్కసారిగా దూసుకురావడంతో శిబిరానికి వచ్చిన వారంతో
చెల్లాచెదురయ్యారు..దీక్షకు ఉపయోగించిన టెక్నికల్ సిస్టంలు అన్నీ మురుగునీటిలో మునిగిపోయాయని తెలిపారు.      మునిసిపల్ కార్యాలయానికి 10 మీటర్ల దూరంలోనే ఈ తంతు
నడిచింది..దీంతోదీక్షచేపట్టిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసిపినేతలపై మండిపడ్డారు..ఎవరు ఎన్నికుట్రలు చేసినా పేదలకోసం పోరాటాలు ఆగవని స్ఫష్టంచేశారు..నేతలు కార్యకర్తలు సైతం ఇలాంటి చీప్
పాలిటిక్స్ చేయడం ఏమిటని నిరసించారు..సభకు వచ్చిన ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ నంద్యాలలో మొదలయ్యాయని దీక్షను భగ్నంచేసేందుకు నీచమైన ఆలోచన చేశారంటూ
ఆగ్రహంవ్యక్తంచేశారు..అయినప్పటికి మురుగునీటిలోనే ప్రజలంతా తమఅభిమాన నాయకుడు భూమాబ్రహ్మానందరెడ్డిని కలసి మద్దతు ప్రకటించడం గమనార్హం.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: It achieves a triple political orbit