ఖమ్మంలో ఐటీ హబ్

Date:02/12/2020

ఖమ్మం ముచ్చట్లు:

ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రా్రష్ట్ర ఐటీ, మున్సిఫల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో మంత్రి పువ్వాడ అజయ్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి వేల కోట్ల రూపాయాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఐటీ రంగంలో కొలువులు పొందాలంటే హైదరాబాద్‌, బెంగుళూరు, మద్రాస్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండడంతో ఖమ్మం నగరంలోనే ఐటీ హబ్‌ నిర్మించి ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాల్లో కొలువు సంపాదించే విధంగా మంత్రి అజయ్‌ కృషితో ప్రతిష్టాత్మకంగా నగరం నడిబొడ్డున ఐటీ హబ్‌ నిర్మాణం చేపట్టింది. దీంతో ఐటీ రంగం వైపు జిల్లాలోని నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో వెల్లడానికి ఆస్కారం ఉంటుంది.

 

హైదరాబాద్‌ తరువాత మూడు నగరాలకు ఐటీ విస్తరణతెలంగాణ రా్రష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి కేటీఆర్‌ ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని తరువాత వరంగల్‌, కరీంనగర్‌తో పాటు ఖమ్మం నగరంలో ఐటీ హబ్‌లను నిర్మించాలని నిర్ణయించారు. దీంతో 2017లో ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్‌లో ఐటీ హబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ కోసం నగరంలోని ఎస్‌బీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల గత నెల 28వ తేదీన నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 16 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు ఐదు వేల మంది నిరుద్యోగులు ఈ జాబ్‌ మేళాకు హాజరయ్యారు. వీరిలో 300 మందిని ఎంపిక చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఖమ్మం నగరం ఐటీ రంగానికి కేంద్రంగా మారుతోంది. నగరంలో నిర్మించే ఐటీ హబ్‌కు రూ.12.50 కోట్లతో 25వేల ఎస్‌ఎఫ్‌టీలో గ్రౌండ్‌ ప్లోర్‌తో పాటు నాలుగు అంతస్తులతో ఐటీ హబ్‌ను నిర్మేంచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులను నిర్మించాలని నిర్ణయించింది.

 

 

 

దీంతో మొత్తం 42వేల ఎస్‌ఎఫ్‌టీలో నిర్మాణం చేయాల్సి వచ్చింది. రూ 12.50 కోట్ల అంచనా నుంచి రూ. 25 కోట్లకు పెంచారు. ఎస్‌ఎఫ్‌టీలు, అంతస్తులు పెరగడంతో నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయి. గ్రౌండ్‌ ప్లోర్‌లో టాస్క్‌ కార్యాలయం నిర్వహిస్తారు. మిగిలిన ఐదు అంతస్తుల్లో వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఐటీ హబ్‌ మొదటి దశ నిర్మాణ పనులుపూర్తి కావడంతో రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండో దశ కోసం రూ. 12.50 కోట్లు మంజూరయ్యాయి. ఇది కూడా పూర్తి కాగానే జిల్లాలోని నిరుద్కోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు వీలుంటుంది. హబ్‌ నిర్మాణం పూర్తికాకుండానే మంత్రి అజయ్‌కుమార్‌కు ఉన్న వ్యక్తిగత పరిచయాల కారణంగా పలు కంపెనీలు ఖమ్మం నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే పది కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయి. పలు ఐటీ కంపెనీల నుంచి స్పేస్‌ కోసం వచ్చిన డిమాండ్‌తో నిర్మాణ వైశాల్యాన్ని పెంచాల్సి వచ్చింది. 450 వర్క్‌ స్టేషన్లు సిట్టింగ్‌ సౌకర్యం కల్పిస్తూ కొన్ని వేల మీటర్ల వైరింగ్‌ చేస్తూ ప్రత్యేకంగా నిర్మాణంతో ఈ ఐటీ హబ్‌ను నిర్మించారు.

అధిక వడ్డీల పేరుతో మోసం

Tags: IT hub in Khammam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *