Natyam ad

ఇది అప్పుల బడ్జెట్

కడప ముచ్చట్లు:

కేంద్ర బడ్జెట్ పై ఏపీసీసీ నేత డాక్టర్ ఎన్. తులసీ రెడ్డి పెదవి విరుచారు. ఇది రైతుల,గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఏపి కీ టోపీ పెట్టిన బడ్జెట్. అప్పుల మీద ఆధారపడ్డ బడ్జెట్. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ లో 2.77 శాతం మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఎరువుల సబ్సిడీ లో ఒకేసారి రూ.50120 కోట్ల కోత కోయడం శోచనీయం. గ్రామీణాభివృద్ధి కేటాయింపులో రూ.5013 కోట్లు కోత కోయడం దురదృష్టకరం. ఆహార సబ్సిడీలో ఒకేసారి రూ.89844 కోట్లు భారీ కోత విధించడం గర్హనీయం. కేంద్ర బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదు. ఇప్పటికే దేశం అప్పుల కుప్ప అయింది. 2023-24 లో రూ.15.40 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేస్తుందట.. అంటే మొత్తం బడ్జెట్ లో అప్పులు 34 శాతం. ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రైల్వే జోన్ ఊసే లేదు. పోలవరాన్ని పట్టించుకో లేదు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదని అన్నారు.

 

Tags: It is a debt budget

Post Midle
Post Midle