మహిళా పోలీసును ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభపరిణామం. 

-ఏపి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి హర్షం
 
అమరావతి ముచ్చట్లు:
 
గ్రామ మహిళా పోలీస్‌ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేసి ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభ పరిణామమని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమె ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్‌, జాబ్‌ చార్ట్, సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల ఖరారుతో పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని పేర్కొన్నారు.మహిళా పోలీసు, సీనియర్‌ మహిళా పోలీసు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ), ఇన్‌స్పెక్టర్‌ (నాన్‌ గెజిటెడ్‌).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణించనున్నట్లు వివరించారు. మహిళా పోలీస్‌ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండ.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: It is a good thing that women police are recognized as a separate system.

Natyam ad