పూర్ణ‌గా నాగ‌చైత‌న్య‌, శ్రావ‌ణిగా స‌మంతల ప్ర‌యాణ‌మే `మ‌జిలీ`

It is a journey that is perfectly equal to Nagachaitanya and Shravan

It is a journey that is perfectly equal to Nagachaitanya and Shravan

Date:04/03/2019
అక్కినేని  నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌జిలీ`. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత‌తో పాటు దివ్యాంశిక కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సినిమా గురించి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ..సినిమా చూసే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే మ‌ధ్య త‌ర‌గ‌తి భ‌ర్త‌గా ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పూర్ణ‌ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఈయ‌న పాత్ర ఇన్‌టెన్స్‌గా, వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స‌మంత అక్కినేని శ్రావ‌ణి అనే అమ్మాయిగా క‌న‌ప‌డుతుంది. ఈమె త‌న న‌ట‌న‌తో న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమాను వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీక‌రించాం. ఇదొక ఎమోష‌నల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌.సినిమాలో న‌టించిన మ‌రో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందన్నారు.
రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ఎనిమిది మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది.
గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుద‌ల చేస్తున్నారు.  నిర్మాత‌లు  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌, యాక్ష‌న్‌:  వెంక‌ట్‌, ఎడిట‌ర్‌:  ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌:  సాహి సురేష్‌, సినిమాటోగ్ర‌ఫీ:  విష్ణు శ‌ర్మ‌, సంగీతం:  గోపీసుంద‌ర్‌, నిర్మాత‌లు:  సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌.
Tags:It is a journey that is perfectly equal to Nagachaitanya and Shravan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *