Natyam ad

బూటకపు హామిలివ్వడం బాబు నైజం.

రాష్ట్రంలో వైఎస్సార్ సీపీదే అధికారం.
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.

 

రాయచోటి ముచ్చట్లు:

బూటకపు హామీలు ఇవ్వడం, వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలో బాబు కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు విశ్వసనీయత లేదని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మీడియా ముందు ఆరోపించారు. ఎన్నికల ముందు కొత్త బూటకపు పథకాలతో చంద్రబాబు అతని అనుచరులు ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి సేవ చేయాలన్న సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అమలు చేయలేని పథకాలతో ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యధావిధిగా ప్రజలకు అందాలంటే వైఎస్ఆర్సిపికి ప్రజలు మరో మారు అవకాశం ఇవ్వాలన్నారు. బాబు ఓట్లు వేస్తే ఉన్న పథకాలతో పాటు చెప్పిన హామీలన్నీ మటుమాయం అవుతాయన్నారు. టిడిపి మేనిఫెస్టో విషయంలో డ్వాక్రా మహిళలు మోసపోవద్దని అధికార ప్రతినిధి హెచ్చరించారు.

 

 

 

 

Post Midle

రైతుల కోసం అంతా నేనే చేశానని చెబుతున్న మాటలలో చేసింది శూన్యమన్నారు. బాబు, పవన్ కళ్యాణ్ లో బూటకపు హామీలు ఇస్తున్నారన్న సమాచారంతో బిజెపి మేనిఫెస్టోలో తన ఫోటోలను వాడుకోవద్దని సూచించారన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు పెట్టుకున్నప్పటికి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడానికి అంగీకరించకపోవడం బాబు నైజాన్ని బయటపడుతోందన్నారు.ఇచ్చిన హామీలలో కూడా కొత్తదనం లేకుండా వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కూటమి కాపీ రూపంలో అధిక మొత్తం చెల్లిస్తామని మోసపూరిత మాటలు చెప్పి వెన్నుపోటు పొడవడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఇంటికి పెన్షన్లు రావని, ఇచ్చే పెన్షన్లకు పోత పడుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవేశపెడుతున్న పథకాలకు అయ్యే ఖర్చు, వాటి అవసరాలకు అవసరమైన నిధులు రాబడిపైన చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు తన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు అయ్యే బడ్జెట్, ఆ నిధులను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పే దమ్ముందా అంటూ రమేష్ రెడ్డి నిలదీశారు. కూటమి మేనిఫెస్టో అంతా ఒక పాపాల పుట్ట, అసత్యాల బొంత అని ఎద్దేవ చేశారు. పంచాయతీలలో సర్పంచ్ పాలకవర్గం ఉన్నా పథకాల ఎంపికలు జన్మభూమి కమిటీలతో ఓకే చేయించి ఆ వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

 

 

ఉద్యోగము లేదు,, నిరుద్యోగ భృతి లేదు..

బాబు వస్తేనే జాబు అని 2014 ఎన్నికలలో ఉాదరగొట్టిన చంద్రబాబు తర్వాత రాష్ట్రంలో ఉద్యోగము ఇవ్వలేదు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదని రమేష్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా 2వెల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను మోసం చేసిన చరిత్ర బాబుది అన్నారు. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం, పండంటి బిడ్డకు రూ.10వేలు ఇస్తానని చెప్పిన హేమి బుట్ట దాఖలు అయ్యిందన్నారు. బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలు, 10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని చెప్పి మోసం చేసిన విషయం వాస్తవం కాదా అన్నారు. రాను ఎన్నికలలో అమలు చేస్తానని హామీలను మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రజల మనసులలో జగన్మోహన్ రెడ్డి మరో మారు స్థానాన్ని సంపాదించారన్నారు. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

 

Tags:It is Babu’s habit to give fake pregnancy.

Post Midle