అనందయ్య నాటు మందు అనుమతించడం హర్షణీయం

పాములపాడుముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టు అధికారికంగా అనుమతులు ఇవ్వడం హర్షణీయం,అభినందనీయం అని సేవాభారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ అలీ అని అన్నారు.
ఈ సందర్భంగా సేవా భారతి వై ఆర్ డి ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ కమిటీ ఆనందయ్య నాటు మందు ను పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత అనుమతి లభించిందన్నారు.
ఈ నాటు వైద్యం ఆయుర్వేదం అనేది పూర్వం ఆదిమానవుడి నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగి ఉందన్నారు. ఈ మందులు ఎంబీబీఎస్ డాక్టర్స్ పరిశోధన చేసే సైంటిస్టులు సైతం నయం చేయలేని అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే గొప్ప మూలికలు ఉన్నాయన్నారు. ఈ వ్యాధిని నయం చేస్తాయి కానీ మనిషికి ఎటువంటి హాని కలిగించవు అని అన్నారు.   చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఆయుర్వేద, యునాని హోమియో వైద్య శాల డాక్టర్స్ వైద్య సిబ్బంది ఉన్నారు కానీ మందులు మాత్రం లేవు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వైద్యశాలలకు పూర్తిస్థాయిలో మందులు పంపిణీ చేయాలి. ప్రతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆనందయ్యా నాటు మందును కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలి. అదేవిధంగా వీటిని తరచూ అధికారులు పర్యవేక్షించాలి. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ ను అన్ని రకాల అభివృద్ధి చేయాలన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:It is delightful to allow Anandayya Natu medicine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *