భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం
— భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
— అభివృద్ది పనులు పరిశీలన
— పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు సులభతరంగా అతిదగ్గరనుంచి అమ్మవారిని దర్శించుకొనేలా చర్యలు తీసుకొంటున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆలయ కమిటి చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, ఆలయ ఈఓ చంద్రమౌళి, ఏఐపీపీ మెంబర్ అంజిబాబు తో కలిసి బోయకొండలో జరుగుతున్న పలు అభివృద్దిపనులను పరిశీలించారు. ఆలయ అడ్మినిస్ట్రేటివ్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రహరీ,రోడ్డు నిర్మాణ పనులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గోశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. బోయకొండలో ప్రస్తుతం ఉన్న క్యూలైన్లును మార్పు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం అతిదగ్గనుంచి నేరుగా వెళ్ళి దర్శించుకొనేలా కొత్తగా క్యూలైన్లు ఏర్పాటుచేసేందుకు చర్చించారు. ఆలయం వద్ద హ్గమ గుండం పనులను పరిశీలించారు. ఆలయం వద్ద వెహోక్కల సంరక్షణతోపాటు, పార్క్ సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. భక్తులకు అవసరమైన సదుపాయాలతోపాటు ప్రస్తుతం ఉన్న సేవలపై భక్తులతో మాట్లాడి ఆరా తీశారు. ఉచిత ప్రసాదాల పంపిణీ తనిఖీ చేశారు. ఆయన వెంట పాలక మండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, సోమల మల్లికార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి ,పాల ఏకరిల సంఘ రాష్ట్ర డైరక్టర్ లడ్డూరమణ, పీహెచ్‌సీ కమిటీ చైర్మన్ కళ్యాణ్‌భరత్, నాయకులు మునికృష్ణమనాయుడు, రఘుపతి, నవీన్‌రెడ్డి, గిరిబాబు, తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; It is easy for the devotees to see the Goddess