ఈ ఏడాది హెర్డ్ ఇమ్యూనిటీ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం అసాధ్యం: డ‌బ్ల్యూహెచ్‌వో

Date:12/01/2021

జెనీవా ముచ్చట్లు:

హెర్డ్ ఇమ్యూనిటీ ల‌క్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోవ‌డం అసాధ్య‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. సామూహికంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టినా.. హెర్డ్ ఇమ్యూనిటీ ల‌క్ష్యాన్ని ఈ ఏడాది అందుకోలేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ఖండంలో ఆ రేటు అధికంగా ఉన్న‌ది.  వైర‌స్ టీకాల పంపిణీ జోరుగా సాగుతున్నా.. ఈ ఏడాదే క‌రోనాను అదుపులోకి తీసుకురాలేమ‌ని ఆమె అన్నారు.  వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునే స్థాయిలో టీకాలు ఉత్ప‌త్తి చేయ‌లేమ‌ని, దీనికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారామె.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు 9 కోట్ల మందికి వైర‌స్ సోకింది. సుమారు రెండు కోట్ల మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు విడిచారు.  ఈ ఏడాది హెర్డ్ ఇమ్యూనిటీ కుద‌ర‌ద‌ని,  సామాజిక దూరం, చేతులు క‌డుక్కోవ‌డం, మాస్క్‌లు ధ‌రించ‌డం లాంటి నియ‌మాలు పాటించాల్సిందే అని సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు.  బ్రిట‌న్‌లో క‌నిపించిన కొత్త వేరియంట్ ప‌ట్ల జాగ్‌‌త్త‌గా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: It is impossible to reach the Herd Immunity Goal this year: WHO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *