సంకల్ప యాత్ర హామీలు నేరవేర్చిన ఘనత జగన్‌దే
పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలను 99 శాతం పైగా అమలు చేసి, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని , సంకల్ప యాత్రకు ఆరేళ్లు కావస్తోందని రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషాతో కలసి దివంగత రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి నవరత్నాలను అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. గత ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు , కులాలకు, మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి , గౌరవించడం జరిగిందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చిరకాలం ఉండేలా ప్రజలందరు ఆశీర్వదించి, ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు కొండవీటి నటరాజ, మనోహర్, కిజర్‌ఖాన్, నరసింహులు, జెపి యాదవ్ , సాజిదాబేగం, రేష్మా తదితరులు పాల్గొన్నారు.

Tags: It is Jagan’s credit to fulfill the Sankalpa Yatra promises
