పరవళ్లు తొక్కతుున్న కృష్ణానది

హైదరాబాద్ ముచ్చట్లు:


కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు పోటెత్తడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతుండటంతో కృష్ణా రివర్‌ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారుతున్నాయ్‌. అసలు, ఏ ప్రాజెక్టులో ఎంత నీటి మట్టం ఉంది? ఇన్‌ఫ్లో ఎంతుంది? ఔట్‌ఫ్లో ఎంతుంది?జురాలకు ముందుండే, నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌లో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరింది. రిజర్వాయర్ కెపాసిటీ 1615 అడుగులు కాగా, ఆల్రెడీ 1612 అడుగులకు నీటిమట్టం చేరింది. 37 టీఎంసీలకు ఆల్రెడీ 35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో లక్షా 35వేల క్యూసెక్కులు ఉండే, ఔట్‌ఫ్లో లక్షా 42వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.జురాల ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. డ్యామ్‌ కెపాసిటీ 1045 అడుగులు కాగా ఆల్రెడీ 1042 అడుగులకు నీటిమట్టం చేరింది. 9.66 టీఎంసీలకు 8.79 టీఎంసీల నీటినిల్వ కొనసాగుతోంది. ఇక, ఇన్‌ఫ్లో 58వేల క్యూసెక్కులు… ఔట్‌ఫ్లో 73వేల క్యూసెక్కులుగా ఉంది జురాలలో…తుంగభద్ర ప్రాజెక్టు అయితే నిండుకుండలా మారింది. 1633 అడుగులకు 1632 అడుగుల నీటిమట్టం ఉందక్కడ. నీటినిల్వ సామర్ధ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రజెంట్‌ 101.77 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో లక్షా 38వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో లక్షా 59వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.శ్రీశైలం రిజర్వాయర్‌ కంప్లీట్‌గా నిండిపోయింది. ప్రాజెక్ట్‌ సామర్ధ్యం 885 అడుగులు కాగా నీటిమట్టం 884.8 అడుగులకు చేరింది. 215.81 టీఎంసీలకు 214.36 టీఎంసీలకు చేరుకుంది. ఇక, ఇన్‌ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2లక్షల 19వేల క్యూసెక్కులుగా ఉందిక్కడ.

 

 

 

నాగార్జునసాగర్‌లోనూ నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ సామర్ధ్యం 590 అడుగులు కాగా, ప్రజెంట్‌ 576.3 అడుగులకు చేరింది నీటిమట్టం. 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 272.44 టీఎంసీలు నీటి నిల్వ కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో లక్షా 84వేల క్యూసెక్కులు ఉంటే, దిగువకు 32వేల క్యూసెక్కులను వదులుతున్నారు.పులిచింతల ప్రాజెక్టుకు సైతం వరద నీరు పోటెత్తుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా ఉంటే ప్రస్తుతం 171 అడుగులకు చేరుకుంది. 45.77 టీఎంసీలకు 40.53 టీఎంసీల నీటినిల్వ ఉందిక్కడ. ఇక, ఇన్‌ఫ్లో 39వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 51వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.ప్రకాశం బ్యారేజీ అయితే నిండుకుండలా మారింది. నీటిమట్టం, నీటినిల్వ రెండూ కూడా పూర్తిస్థాయికి చేరుకున్నాయ్‌. 57 అడుగులకు 57 అడుగులు, 3.07 టీఎంసీలకు 3.07 టీఎంసీల వాటర్‌ ఉందిక్కడ. ఇన్‌ఫ్లో లక్షా 2వేల క్యూసెక్కులు ఉంటే అంతే నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు.
భయపెడుతున్న గోదారిగత నెలలో కురిసిన భారీ వర్షాలు, గోదావరికి పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భద్రాచలం  వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారుర. గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించి కొనసాగుతోంది. గోదావరి వరద కారణంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో నీరు చేరింది. రహదారులు నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంపువాసులకు తాజాగా మరోసారి వరద ముంపు పొంచి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ఆంధ్రప్రదేశ్  లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెలంగాణ నుంచి విలీనమైన మండలాలకు వరద వణికిస్తోంది. గోదావరి, శబరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అయితే వరద ప్రమాదంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదని ముంపుబాధితులు ఆవేదన చేస్తున్నారు.మంగళవారం సాయంత్రానికి కూనవరంలో గోదావరి నీటి మట్టం 42 అడుగులు దాటింది. చింతూరు-వరరామచంద్రాపురం ప్రధాన రహదారిపై వరద చేరింది. ఎటపాక మండలం గుండాల, రాయనపేట, కొల్లుగూడెం తదితర మురుమూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు.. దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. వరదల కారణంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు చింతూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.కాగా.. గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని సాగర సమంగమం వరకు అన్ని ఉద్ధృతంగా ప్రవహించింది. పరివాహక ప్రాంతాలను ముంచేస్తూ భయాందోళనలు రేకెత్తించింది. భధ్రాచలం పట్టణం నీట మునిగింది. గోదావరి నీటిమట్టం ఒకానొక దశలో 70 అడుగులు దాటింది. గత 36 ఏళ్లల్లో తొలిసారిగా భద్రాచలం వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఏపీ లోని ధవళేశ్వరం, రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. లంక గ్రామాలను ముంచెత్తింది. అయితే.. ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుందనుకుంటున్న సమయంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటం బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

 

Tags; It is Krishna who is trampling on the waves

Leave A Reply

Your email address will not be published.