It is necessary to prevent aeration

గాలికుంటువ్యాదిని నివారించుకోవడం అవసరం

– ఏడీ రమేష్‌

Date:17/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పశువులకు గాలికుంటు వ్యాది సోకకుండ నివారించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పశుసంవర్థకశాఖ డీడీ డాక్టర్‌ రమేష్‌ సూచించారు. సోమవారం మండలంలో రాగానిపల్లెలో 29వ గాలికుంటు వ్యాది నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మార్చి 18 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పశువులకు గాలికుంటువ్యాది టీకాలు గ్రామాలకు వెళ్లి వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 10 టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 30 రోజుల్లో అన్ని పశువులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని పశువులకు గాలికుంటు వ్యాది సోకకుండ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మనోహర్‌, వెంకటమునినాయుడు తదితరులు పాల్గొన్నారు.

18న టమోటా విత్తనాలు పంపిణీ

Tags: It is necessary to prevent aeration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *