గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదు
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఉద్యోగుల గోడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలి. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్ కు విన్నవించటం నేరమా? ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ అంశాలేవి ప్రస్తావించలేదు కదా! ఉద్యోగసంఘం నేత కె ఆర్ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు, నిరంకుశ విధానాలు ఇకనైనా విడనాడాలి. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలని అయన అన్నారు.

Tags: It is not appropriate for the state government to blackmail that they will cancel the recognition
