Natyam ad

సన్నిహితంగా లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదు

– బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

ముంబై ముచ్చట్లు:

స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.. అది ఆమె నుంచి లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్‌ భారతీ డాంగ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఓ వ్యక్తి  తన స్నేహితురాలిని పలుమార్లు లొంగదీసుకున్నాడు. తీరా గర్భం దాల్చాక.. మాట మార్చాడు. ఈ వ్యవహారంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ముందస్తు బెయిల్‌ కోసం అతను దాఖలు చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్‌ ఆదేశించింది.ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉంటే.. అది ఆమెతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె ఇచ్చిన సమ్మతిగా భావించడానికి వీల్లేదు అని జస్టిస్‌ భారతి అభిప్రాయపడ్డారు.  నేటి సమాజంలో..  స్నేహం అనేది ఆడా-మగా అనే తేడాలను బట్టి ఉండడం లేదు. ఒకే తరహా అభిప్రాయాలు, ఆలోచనలు లేదంటే కంఫర్ట్‌ జోన్‌లో ఉండడం లాంటి అంశాలను బట్టే స్నేహాలు చేస్తున్నారు. ముఖ్యంగా పని చేసే చోట కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని.. స్నేహం అనేది బలవంతంగా వాళ్లను(మహిళలను) లొంగదీసుకునేందుకు మగవాళ్లకు దొరికే హక్కే ఎంత మాత్రం కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేసులో ఆమె అతని పట్ల ఆకర్షితురాలైందని, కానీ, పెళ్లి ప్రస్తావనతో అతనికి లొంగిపోయిందా? లేదంటే బెదిరింపులకు, బలవంతం చేశాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

 

Post Midle

Tags; It is not like consenting to intimate sex

Post Midle