Natyam ad

సచివాలయ సిబ్బంది ఇస్టానుసారంగా సెలవులు పెడితే కుదరదు

-అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల పురపాలక సంఘము లో అన్ని వార్డు సచివాలయ కార్యదర్శులు సెలవులు ఇస్టానుసారంగా పెడితే కుదరదని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ అన్నారు. శనివారం నాడు ఓ ప్రకటనలో మాట్లాడుతూ  ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారి మౌఖిక ఆదేశాల మేరకు  ప్రతి సచివాలయ కార్యదర్శిసెలవు మంజూరు కొరకు మున్సిపల్ ఆఫీస్ కు సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే రావలెనని . మరియు మీ యొక్క సెలవు మంజూరు పత్రం పై మీరు సెలవులో ఉన్నప్పుడు ఆ విధులను ఎవరు నిర్వహిస్తారో ఇన్చార్జి సెక్రెటరీ యొక్క వివరాలు వ్రాసుకుని, అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ తో ఆ సెలవు మంజూరు దరఖాస్తు మీద సంతకం చేయించుకొని రావలను, అదేవిధంగా ప్రతి సెక్రటరీ మున్సిపల్ ఆఫీస్ నందు వారికి సంబంధించిన సెక్షన్ అధికారుల యొక్క అనుమతితోనే సెలవులు మంజూరు చేయబడును అని అన్నారు . మూడు రోజుల వరకు ఎటువంటి సెలవులు అయిన అసిస్టెంట్ కమిషనర్ గారి వద్ద మంజూరు చేయించుకొన వలెనని తెలిపారు . ప్రతి సెక్షన్ అదికారి సెలవుల రిజిస్టర్ నిర్వహించి అందులో  సెక్షన్ కు సంబంధించిన సెక్రటరీల సెలవులు నమోదు చేయవలెనని అన్నారు.

 

 

Post Midle

(అడ్మిన్ సెక్రటీలు – రెవెన్యూ ఆఫీసర్ వద్ద) నమోదు చేయాలని.  (అమినిటీస్ సెక్రటరీలు- 1 నుండి 17 వార్డులు డీఈ మదు ,వద్ద) . (18 to 43 వార్డులు- డీఈ శ్రీ జయ భారత్ రెడ్డి . వద్ద) . (ప్లానింగ్ సెక్రటరీలు ఎసిపి వద్ద)(1 టు 12, 36 టు 42వార్డులు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి వద్ద) . (13 టు 35 వార్డులు కానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి నారాయణ వద్ద)  (హెల్త్ సెక్రటీలు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వద్ద)(వెల్ఫేర్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు,మహిళా పోలీసులు, రెవెన్యు సెక్రెటరీ స్ లు అసిస్టెంట్ కమిషనర్ వద్ద) నమోదు చేయించుకోవాలని సచివాలయ సిబ్బంది కి తగు సూచనలు చేశారు.

 

Tags: It is not possible for the Secretariat staff to take leave as per the request

Post Midle

Leave A Reply

Your email address will not be published.