It is our responsibility to save your life.

మీ ప్రాణాలు కాపాడుకోవడం మా బాధ్యత కరోనా కట్టడకి ప్రజలు సహకరించాలి..!

-ఇంటి నుంచి బయటకు రావద్దు నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

– రెడ్ జోన్ గ్రామాన్ని సందర్శించిన శ్రీకాళహస్తి డిఎస్పీ నాగేంద్రుడు

Date:09/05/2020

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా
గురువారం వరకు ఆరెంజ్ జోన్ గా ఉన్న బుచ్చినాయుడు కండ్రిగ మండలాన్ని శుక్రవారం మళ్ళీ తిరిగి రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు…పాజిటివ్ వచ్చిన వ్యక్తి కి సంబంధించిన 12 మంది కుటుంబసభ్యులను శుక్రవారం క్వారంటీన్ కు తరలించారు…రెడ్ జోన్ గ్రామాన్ని సందర్షించిన శ్రీకాళహస్తి డిఎస్పీ నాగేద్రుడు మాట్లాడుతూ ప్రజలు అందురు తమ ఇంటి వద్దనే ఉంటూ బయటకు రాకుండా కరోనాను కట్టడి చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.అనంతరం స్థానిక ఎస్సై ధర్మారెడ్డి కి కరోనా కట్టడికి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు మరియు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు..ఈ కార్యక్రమంలో EO.PRD విజయనిర్మల,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,హెడ్ కానిస్టేబుల్ గురవయ్య కానిస్టేబుల్ బాబు పాల్గొన్నారు.

ఏపీలో మరిన్ని మద్యం షాపులు మూసివేత

Tags: It is our responsibility to save your life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *