మన రాతలు మార్చేది గురువులే
పుంగనూరు ముచ్చట్లు:
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి తలరాతలను రాస్తున్నది ఉపాధ్యాయులేనని వారిని గౌరవించాలని జెడ్పిహైస్కూల్ హెచ్‌ఎం రుద్రాణి తెలిపారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలసి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఆశయాలను అమలు చేయాలని సూచించారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Tags: It is the teachers who change our writings
