Natyam ad

రహదారి ప్రమాద సంఘటన జరగడం దురదృష్టకరం. 

-సంతాపం తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

 

రామాపురం ముచ్చట్లు:

 

రామాపురం మండలంలోని జాతీయ రహదారి పై సెరికల్చర్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన రహదారి ప్రమాదంలో రామాపురం మండలం సరస్వతిపల్లె గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన భవాని (32) , ఈమె కుమార్తె వినీత(4),వీరి భావ కుమారుడు కృష్ణబాబు (22) లు మృతి చెందడం దురదృష్టకరమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.వారి మృతి పట్ల సంతాపం తెలిపారు.పోలీసు,వైద్యాధికారులుకు శ్రీకాంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడి పోస్ట్ మార్టం తదితర సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

 

Post Midle

Tags: It is unfortunate that the road accident happened.

Post Midle