క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

It is very useful for sports health

It is very useful for sports health

– మాజీ ఎంపి మిధున్‌రెడ్డి.

Date:12/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

యువకులు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడుతుందని రాజంపేట మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో వైఎస్సాఆర్‌సీపీ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో క్రీకెట్‌ పోటీలను ఏర్పాటు చేశారు. మిధున్‌రెడ్డి ప్రారంభోత్సవం చేసి క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం చేపట్టారు. క్రీకెట్‌ ఆడి , క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మానసిక ఉల్లాసం లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఆనారోగ్యానికి గురౌతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారన్నారు.ప్రస్తుతం నాణ్యమైన ఆహారం లేకపోవడంతో ఆనారోగ్యానికి గురై య్యేవారి సంఖ్య అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, సంయుక్త కార్యదర్శి అక్కిసాని బాస్కర్‌రెడ్డి, వైఎస్సాఆర్‌సీపీ జెడ్పీప్లోర్‌లీడర్‌ వెంక టరెడ్డి యాదవ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగకార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దిన్‌ షరీఫ్‌, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, మనోహర్‌, ఆసిఫ్‌, రెడ్డిశేఖర్‌, రేష్మా, మంజుల తదితరులు పాల్గొన్నారు.

 

ఎన్ఐఏ కస్టడీలో శ్రీనివాసరావు

Tags; It is very useful for sports health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *