ఎంపీ రమేష్ నివాసాలలో ఐటీ సోదాలు

IT mounts in MP Ramesh residences

IT mounts in MP Ramesh residences

Date:12/10/2018
అమరావతి  ముచ్చట్లు:
ఏపీలో మరోసారి ఆదాయపు పన్ను అధికారులు సోదాలకు దిగారు. శుక్రవారం నాడు  టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కడపజిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి, హైదరాబాద్లోని నివాసాలు సహా రమేష్ చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంజరా హిల్స్ లోని రుత్విక్ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సుమారు ఆరవై మంది ఐటీ అధికారులు  పలు  చోట్ల సోదాలు ని ర్వహిస్తున్నట్లు సమాచారం.  కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఢిల్లిలో వున్నారు.
ఏపీలో ఐటీ దాడులపై వివరాలివ్వాలంటూ ఐటీశాఖకు నోటీసులు జారీ చేసిన మూడ్రోజుల వ్యవధిలోనే రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరగడం విశేషం. మరోవైపు, కడప ఉక్కు పరిశ్రమ కోసం అయన ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి వంద రోజులు పూర్తయింది.   ఐటీ దాడులపై రమేష్ స్పందించారు. తనను వ్యతిరేకించేవారిని మోదీ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌లో మాదిరిగా ఏపీలోనూ కుట్రలు చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థులను అణచివేస్తున్నారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప ఫ్యాక్టరీ విషయం తేల్చాలని రేపు ఉక్కుమంత్రిని నిలదీయనున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న తమను చూసి బీజేపీ సహించలేకపోతున్నదని ఆయన అన్నారు. దేనికి  భయపడేది లేదని అన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీడియా సమక్షంలో దాడులు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
Tags:IT mounts in MP Ramesh residences

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *