రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు
హైదరాబాద్ ముచ్చట్లు:
మంగళవారం తెల్లవారుజామునుంచి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణాలు కొనసాగిస్తున్న వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాలపై గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు హైటెక్ సిటీలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసారు. వంశీరామ్ బిల్డర్స్ ఛైర్మన్ తిక్కవరపు సుబ్బారెడ్డి కార్యాలయం, అయన బావమరిది, సంస్థ డైరెక్టర్ జనార్థన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది.
అటు ఏపీలోని విజయవాడలోనూ ఐటీ దాడులు నిర్వహించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ లోని దేవినేని అవినాష్ స్థలాన్ని వంశీరామ్ బిల్డర్స్ డెవలప్మెంట్కు తీసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలను నిర్వహించాయి. ఉదయం 6 గంటల నుంచి దాడులు ప్రారంభమయ్యాయి.

Tags; IT raids in two Telugu states
